Karthika Deepam2 : కార్తీక్ దీపల శోభన ముహార్తానికి రంగం.. జ్యోత్స్న ఏం చేయనుంది?
on Nov 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -193 లో.. దాస్ ఇంటికి పారిజాతం వస్తుంది. అక్కడున్న కాశీ, స్వప్నలతో దీప, కార్తీక్ ల పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంది. జనాలకి చెప్పుకోరు. ఇంట్లో కాపురం తప్ప.. బయట ప్రపంచానికి వాళ్ళు భార్యాభర్తలని చెప్పుకోరని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంటే.. అలా ఏం కాదు.. వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేస్తానని స్వప్న అంటుంది. కరెక్ట్ చెప్పావ్ వాళ్లకి రిసెప్షన్ చేస్తామని పారిజాతంతో స్వప్న, కాశీ ఛాలెంజ్ చేస్తారు.
ఆ తర్వాత దాస్, కాశీ, స్వప్న ముగ్గురు కలిసి కాంచన దగ్గరికి వెళ్తారు. దీప, కార్తీక్ లని హాల్లోకి పిలుస్తారు. అప్పుడే దాస్ కి ఫోన్ వస్తుంది. పక్కకి వెళ్లి మాట్లాడతాడు. అతని ఊరు ముత్యాలమ్మ గూడెమానని దాస్ ఫోన్ లో అంటుంటే.. అప్పుడే అనసూయ కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి బాబు ఆ ఊరు అని చెప్పబోతుంటే ఆమెకి నిజం తెలియకుడదని దాస్.. ఏం లేదమ్మ అని అంటాడు. మరోవైపు ఎవరికి తెలియకుండా పెళ్లి జరిగింది. అందరికి తెలిసేలా రిసెప్షన్ చేద్దామని అనుకుంటున్నామని దీపతో కాశీ అంటాడు. మంచి నిర్ణయం.. గుడిలో జరిగిన మీ పెళ్లి గురించి అందరికి తెలియాలని దీప అనగానే.. రిసెప్షన్ మాకు కాదు మీకు అని కాశీ అనగానే.. దీప షాక్ అవుతుంది. వెంటనే వద్దని చెప్తుంది. అందరి నోళ్లు మూయించాలంటే అందరికి మీ పెళ్లి గురించి తెలియాలని స్వప్న అంటుంది. థాంక్స్ స్వప్న.. నేను ఎలా అందరికి తెలిసేలా చెయ్యాలి అనుకున్న మంచి ఆలోచన అని కార్తీక్ అంటాడు. మీ అమ్మని రిసెప్షన్ కి ఒప్పించమని శౌర్యతో అందరు చెప్తారు.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే.. దీప, కార్తీక్ ల ఇన్విటేషన్ పంపిస్తాడు కాశీ. అది చూసి పారిజాతం టెన్షన్ పడుతుంటే.. ఏంటి అది చూపించమని అంటాడు. శివాన్నారాయణ ఫోన్ తీసుకొని దశరథ్ ని చుడమని చెప్తాడు. దీప, కార్తీక్ ల రిసెప్షన్ ఇన్విటేషన్.. తనకి ఎందుకు వచ్చిందని శివన్నారాయణ కోప్పడతాడు. రిసెప్షన్ స్వప్న, కాశీ ఇద్దరు చేస్తున్నారంట అని దశరథ్ చెప్పగానే.. శివన్నారాయణ కోప్పడతాడు. అక్కడికి వెళ్తే మళ్ళీ నీకు ఇంట్లోకి ఎంట్రీ లేదని పారిజాతానికి శివన్నారాయణ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా వాళ్ళను ఆ విషయం గురించి అడగాలని వెళ్తుంటే.. ఇప్పుడే వద్దని పారిజాతం సముదాయించి లోపలికి పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read